తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్ డైరెక్టర్ కుమార్తె పెళ్లి.. సీఎం శుభాకాంక్షలు - movie news

చెన్నైలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో కోలీవుడ్​ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం నిరాడంబరంగా జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై, వధూవరులను దీవించారు.

Director Shankar's daughter gets married
దర్శకుడు శంకర్ కుమార్తె పెళ్లి

By

Published : Jun 27, 2021, 2:09 PM IST

ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. క్రికెటర్ రోహిత్ దామోదరన్​ను కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హాజరై, వధూవరులను దీవించారు.

ఐశ్వర్య-రోహిత్ పెళ్లి

కరోనా కారణంగా కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత భారీస్థాయిలో రిసెప్షన్​ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

శంకర్, మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించగా, షూటింగ్​ మొదలుకావాల్సి ఉంది. మరోవైపు ఆయన దర్శకత్వం వహిస్తున్న 'భారతీయుడు 2'.. పలు కారణాలతో ఆగిపోయింది.

ఐశ్వర్య-రోహిత్ పెళ్లి
ఐశ్వర్య-రోహిత్ పెళ్లి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details