ప్రముఖ దర్శకుడు శంకర్(Director Shankar) ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య(Aishwarya Shankar marriage)కు తమిళనాడు క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. ఆదివారం(జూన్ 27) మహాబలిపురంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరగనుంది.
లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇరు కుటుంబాల సమక్షంలో ఈ కల్యాణం జరగనుందని సమాచారం. కరోనా ఆంక్షలను సడలించిన తర్వాత రిసెప్షన్ పెట్టి దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ వ్యాపారవేత్త దామోదరన్ కుమారుడు రోహిత్ దామోదరన్(Rohit Damodaran). తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లోని మధురై పాంథర్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరిస్తున్నాడు. దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య డాక్టర్‌గా పనిచేస్తోంది.
దర్శకుడు శంకర్.. ప్రస్తుతం 'భారతీయుడు 2'(Indian 2) చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(RC15)తో ఓ సినిమా చేస్తుండగా.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో 'అపరిచితుడు'(Anniyan Remake) హిందీలో తెరకెక్కించనున్నారు.
ఇదీ చూడండి..Acharya: ఆఖరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం