హీరో ప్రభాస్'జాన్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే డార్లింగ్ చేయబోయే తర్వాత సినిమాల గురించి అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడనే విషయం ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను 'బాహుబలి' కంటే హైరేంజ్లో తీయాలని ఈ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. దిల్రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. వీటిన్నింటిపై ధ్రువీకరణ రావాల్సి ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తోనూ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు శంకర్. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ఈ దర్శకుడు ముందు షూటింగ్ మొదలుపెడతాడో చూడాలి.