కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'. గతేడాది చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగడం వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీనికి తోడు కరోనా వైరస్, లాక్‌డౌన్ మరొక కారణం. ఇదిలా ఉండగానే దర్శకుడు శంకర్ ఇటీవల తెలుగులో రామ్‌చరణ్‌తో, బాలీవుడ్‌లో రణ్వీర్ సింగ్‌తో చిత్రాలకు దర్శకత్వం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టు మెట్లెక్కింది. ముందుగా తమ సినిమాను పూర్తి చేయాలని కోరింది. తాజాగా దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన శంకర్.. మూవీ ఆలస్యమవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు.
"ఇండియన్ 2' ఆలస్యానికి కమల్, లైకా కారణం' - శంకర్ కౌంటర్ పిటిషన్
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇండియన్ 2'. పలు కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యమవడం వల్ల శంకర్ మరో రెండు కొత్త చిత్రాలకు ఒప్పుకొన్నారు. దీంతో ఆగ్రహించిన నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన శంకర్.. మూవీ ఆలస్యమవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు.
ఈ పిటిషన్లో సినిమా ఆలస్యమవడానికి కారణం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు హీరో కమల్ హాసన్ అని స్పష్టం చేశారు శంకర్. "కమల్ హాసన్‌కు మేకప్ ఎలర్జీ వల్ల ప్రారంభంలో సినిమా ఆలస్యమైంది. తర్వాత షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో నా వల్ల ఎటువంటి నష్టం కలగలేదు. కరోనా ఆంక్షల వల్లే ఇలా జరిగింది. జూన్ వరకు సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నా" అని పేర్కొన్నారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'ఇండియన్ 2'లో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, మనోబాల తదితరులు నటిస్తున్నారు.