ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లవ్​స్టోరీ' తర్వాత థ్రిల్లర్​తో రానున్న శేఖర్! - శేఖర్ కమ్ముల సినిమాలు

మరోసారి థ్రిల్లర్​ కథతో, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలని భావిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. లాక్​డౌన్ వల్ల ఇంట్లో ఉన్న ఈ సమయాన్ని, స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తున్నారట.​

మరోసారి థ్రిల్లర్​ కథతో వస్తున్న శేఖర్ కమ్ముల
దర్శకుడు శేఖర్ కమ్ముల
author img

By

Published : Apr 30, 2020, 5:21 PM IST

ప్రేమ కథల్ని సున్నితంగా చూపించడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల దిట్ట. ఎక్కువగా స్నేహం, ప్రేమ, కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. గతంలో ఓసారి పంథా మార్చి 'అనామిక' అనే థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. బాలీవుడ్​ 'కహానీ'కి రీమేక్​గా రూపొందిన ఈ చిత్రం మిశ్రమఫలితాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు అదే జోనర్​లో తన తర్వాతి ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నారీ డైరెక్టర్.

in article image
అనామిక సినిమాలో నయనతార

ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవిలతో 'లవ్‌స్టోరీ' తీస్తున్నారు శేఖర్. షూటింగ్ చివరి దశలో ఉండగా, లాక్​డౌన్ వల్ల అది నిలిచిపోయింది. దీంతో ఈ విరామ సమయంలోనే తదుపరి చిత్రానికి శేఖర్, కథ సిద్ధం చేస్తున్నారట. అయితే ఈసారి ప్రేమకథ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తీయాలని భావిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు 'అనామిక'లా నాయిక ప్రాధాన్యమా? లేదా మరేదైనా జోనర్​ అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details