కరోనా వ్యాక్సినేషన్‌తో థియేటర్లకు ప్రేక్షకుల రాక మొదలవడం ఆనందంగా ఉందని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. తన దర్శకత్వం వహించిన 'లవ్‌స్టోరి' చిత్రాన్ని త్వరలో థియేటర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
'లవ్‌స్టోరి' కోసం చైతూ చాలా కష్టపడ్డారు: శేఖర్‌కమ్ముల - naga chaitanya sai pallavi samantha
నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న 'లవ్‌స్టోరి' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
'లవ్‌స్టోరి' కోసం చైతూ చాలా కష్టపడ్డారు: శేఖర్‌కమ్ముల
'లవ్‌స్టోరి'లో తెలంగాణ యాసలో నటించేందుకు నాగచైతన్య చాలా కష్టపడ్డారని శేఖర్ కమ్ముల తెలిపారు. పల్లె నుంచి పట్టణానికి వచ్చి స్థిరపడదామనుకున్న ఓ యువకుడి కథ ఎలాంటి మలుపు తిరిగిందనేది ఈ సినిమా కథగా అని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది చదవండి:ఆ సీన్లు చేయడం చైతూకు కష్టమే: సమంత
Last Updated : Jan 11, 2021, 7:29 PM IST