గోపీచంద్ హీరోగా నటిస్తన్న చిత్రం 'సీటీమార్'. కబడ్డీ కథతో ఈ సినిమాను తీస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని చెబుతూ, ఓ వీడియోను పంచుకున్నాడీ డైరక్టర్.
'సీటీమార్'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం - సంపత్‌నంది సీటీమార్
గోపీచంద్ 'సీటీమార్' సినిమాతో దర్శకుడు సంపత్ నంది కొడుకు నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడీ డైరెక్టర్.
'సీటీమార్'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం
ఈ సినిమా సంపత్‌కు ప్రత్యేకమవడానికి కారణం.. సీటీమార్‌తో తన కొడుకు వెండితెరపై అరంగేట్రం చేస్తున్నాడు. అంతేకాకుండా తను కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Last Updated : Feb 29, 2020, 2:41 PM IST