తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూజా హెగ్డేపై నటి రోజా భర్త విమర్శలు - pooja hegde trivikram

హీరోయిన్ పూజాహెగ్డే తీరు ఈ మధ్య చాలా మారిపోయిందని సీనియర్ నటి రోజా భర్త విమర్శలు చేశారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఆయన ఎందుకలా అన్నారు?

pooja hegde
పూజా హెగ్డే

By

Published : Aug 21, 2021, 6:45 AM IST

Updated : Aug 21, 2021, 9:08 AM IST

తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నటి పూజాహెగ్డే. ఇప్పుడు ఆమెపై నటి రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్‌డమ్‌ రాగానే పూజాహెగ్డే ఎంతో మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. పూజా చేసే పనుల వల్ల నిర్మాతలపై ఆర్థికభారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా-ఆర్కే సెల్వమణి

'సాధారణంగా లొకేషన్‌కు వచ్చేటప్పుడు పూజాహెగ్డే తన వెంట ఓ అసిస్టెంట్‌ను తీసుకువచ్చేది. షూటింగ్‌ సమయంలో మేకప్‌, డ్రెస్సింగ్‌, ఇతర అవసరాలు అతనే చూసుకునేవాడు. కానీ, ఇటీవల వచ్చిన స్టార్‌డమ్‌తో ఆమె తీరు ఎంతో మారింది. లొకేషన్‌కు వచ్చేటప్పుడు ఏకంగా 12 మందిని ఆమె వెంట తెచ్చుకుంటుంది. అంతమంది అవసరం ఏముందో అర్థం కావడం లేదు. అనవసరంగా ఎక్కువమంది అసిస్టెంట్స్‌ను వెంట తెచ్చుకోవడం వల్ల నిర్మాతలపై విపరీతంగా ఆర్థిక భారం పడుతోంది' అని ఆయన అన్నారు.

ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. బాలీవుడ్‌లో సల్మాన్‌ 'కబీ ఈద్‌ కబీ దివాలీ', రణ్‌వీర్‌తో 'సర్కస్‌' చిత్రాలు చేస్తుంది. కోలీవుడ్‌లో విజయ్‌ 'బీస్ట్‌'లో కథానాయికగా నటిస్తుంది. ప్రభాస్‌-పూజా జంటగా నటించిన 'రాధేశ్యామ్‌' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూజాహెగ్డే

ఇవీ చదవండి:

Last Updated : Aug 21, 2021, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details