కాంట్రవర్సీలు, జీవిత కథలు తీయడంలో ముందుండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగా ఓ చిత్రం తీయనున్నాడు. దీనికి 'దిశ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతూ వరుస ట్వీట్స్ చేశాడు.
'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా - దిశ ఘటన
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. 'దిశ' ఘటన ఆధారంగా సినిమా తీయనున్నట్లు ప్రకటించాడు. ఇందులో భయంకర నిజాలు చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ
ఇందులో చాలా భయంకర నిజాలు చెప్పబోతున్నట్లు వర్మ తన ట్వీట్స్‌లో రాసుకొచ్చాడు. రేప్ చేయాలనుకున్న వారు, భయంతో వణికిపోయేలా తన చిత్రంలో సన్నివేశాలు ఉంటాయన్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుందని పేర్కొన్నాడు.
Last Updated : Feb 28, 2020, 6:48 PM IST