నిజ జీవితంలో జరిగే సంఘటనల ప్రేరణతోనే తాను సినిమాలు తీస్తున్నాను తప్పా.. ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. మిర్యాలగూడ పరువు హత్య కేసుకు సంబంధించి తీసిన మర్డర్ సినిమా విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మీడియాతో సమావేశమయ్యారు. ఆ ఘటన వెనుకాల ఉన్న ఎమోషన్‌ను ప్రజలకు చేరవేయాలని సినిమా తీసినట్లు వర్మ పేర్కొన్నారు.
ఘటన వెనక భావోద్వేగాలను వివరించడమే నా ఉద్దేశం: ఆర్జీవీ - రాంగోపాల్ వర్మ తాజా వార్తలు హైదరాబాద్
భావోద్వేగాలు పండించడమే తప్ప ఎవరినీ కించపరిచేలా సినిమా తీయాలన్న ఉద్దేశం తనకు లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. మిర్యాలగూడ పరువుహత్య ప్రేరణతో వర్మ నిర్మిస్తున్న మర్డర్ చిత్రానికి.. హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎవరి వాస్తవ పేర్లను సినిమాలో వాడబోమని చిత్రబృందం కోర్టుకు వివరించింది.
యాదృచ్ఛికమే తప్పా.. ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
అలాగే దిశ ఎన్ కౌంటర్ చిత్రంపై నెలకొన్న వివాదంపై స్పందించిన వర్మ.. దిశ ఎన్ కౌంటర్ సినిమా యాదృచ్ఛికంగా తీసిందే తప్పా.. ఎవరినో కించపర్చాలని కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దిశ ఎన్ కౌంటర్‌పై వస్తున్న వ్యాఖ్యలపై తనకు సంబంధం లేదన్నారు.
ఇదీ చదవండి:ఆర్జీవీ 'మర్డర్' సినిమా విడుదలకు హైకోర్టు పర్మిషన్