'బాహుబలి' కాంబో మరోసారి రిపీట్ కానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారట. మహేశ్‌బాబుతో చిత్రం పూర్తయిన తర్వాతే రాజమౌళి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నాటికి ప్రభాస్‌తో సినిమాను మొదలుపెట్టాలని జక్కన్న యోచిస్తున్నట్లు సమాచారం.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేశ్‌బాబుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.