తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దు: రాజమౌళి - ప్లాస్మాదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి వార్తలు

ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేర్కొన్నారు. కొవిడ్‌ సోకినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా బయటపడొచ్చని తెలిపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Director Rajamouli participates in an awareness program on plasma donation
ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దు: రాజమౌళి

By

Published : Aug 18, 2020, 1:06 PM IST

Updated : Aug 18, 2020, 1:13 PM IST

ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దు: రాజమౌళి

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్‌.కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ తీసిన లఘు చిత్రం, పాటను కమిషనర్‌ సజ్జనార్‌తో కలిసి రాజమౌళి, కీరవాణిలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్లాస్మా దాతలను దర్శకుడు రాజమౌళి అభినందించారు. సైబరాబాద్‌ పోలీసులు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని రాజమౌళి పేర్కొన్నారు. కొవిడ్‌ సోకినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా బయటపడొచ్చని సూచించారు. వైరస్‌ను సకాలంలో గుర్తిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

కొవిడ్‌ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్న రాజమౌళి.. వైద్యులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైరస్‌ బాధితులు పౌష్టికాహారం తీసుకోవాలని.. పరిస్థితి విషమించాక ఆసుపత్రికి వెళ్తే.. వైద్యులకూ కష్టంగా ఉంటుందని తెలిపారు. తాను ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

Last Updated : Aug 18, 2020, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details