Rajamouli in Unstoppable with NBK: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్‌లో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ, నాని, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ చిత్రబృందం పాల్గొన్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో మరో ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేస్తామని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలోనూ రాజమౌళి పాల్గొని ప్రేక్షకులను అలరించారు.