తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్పుడే చూసేసిన జక్కన్న! - తాజా కబురు ఆర్​.ఆర్​.ఆర్​ మూవీ

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​.ఆర్​.ఆర్​ సినిమాను జక్కన్న అప్పుడే చూసేశారట. ఎంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మాటలు అందిస్తున్న సాయుమాధవ్​ బుర్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకి సంగతేంటి?

DIRECTOR RAJAMOULI HAD ALREADY SEEN A RRR MOVIE

By

Published : Oct 13, 2019, 6:16 AM IST

భారతీయ చిత్రసీమలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ‘బాహుబలి’ సిరీస్‌ వంటి హిట్‌ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. టాలీవుడ్​ టాప్​ హీరోలు ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కథానాయకులు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జక్కన్న ఎప్పుడో వీక్షించేశారంటున్నారు ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా.

అదేంటి ఇంకా సెట్స్‌పైనే ఉన్న చిత్రాన్ని జక్కన్న అప్పుడే ఎలా చూసేశాడు అనుకుంటున్నారా? ఈ చిత్రానికి బుర్రానే సంభాషణలు అందిస్తున్నారు. ఈ ప్రముఖ రచయితతాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇప్పటికే జక్కన్న ఈ చిత్రాన్ని తన మనోఫలకంపైన చూసేశారని, ఇప్పుడు ఆ అద్భుత దృశ్యకావ్యాన్ని మనకు చూపించడానికి తన వంతుగా ఏం చేయాలో అది చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కథ గురించి బుర్రా మాటల్లోనే

"రాజమౌళి ఈ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఓ కథను ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. అంత అద్భుతంగా ఉందీ కథ. ఈ స్క్రిప్ట్‌ విషయంలో ఆయన క్లారిటీ మహాద్భుతం. నిజానికి నేను ‘బాహుబలి’ చిత్రానికే జక్కన్నతో పనిచేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరలేదు. ఎట్టకేలకు ఇంతటి గొప్ప చిత్రంతో మా కలయిక కుదిరింది."

సాయిమాధవ్​ బుర్రా, సినిమా రచయిత

ఇద్దరు వీరుల స్ఫూర్తి ఈ సినిమా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో ఓ ఫిక్షనల్‌ స్టోరీగా జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజయ్‌ దేవగణ్, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియా భట్‌ నటించనుంది. ఎన్టీఆర్‌కు కథానాయికను వెతికే పనిలో ఉంది చిత్ర బృందం.

ఇవీ చూడండి.. మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..

ABOUT THE AUTHOR

...view details