కమర్షియల్ సినిమా..కె రాఘవేంద్రరావు(raghavendra rao pelli sandadi) ముందు, తర్వాత అనేంతగా ప్రభావం చూపించిన దర్శకుడు. ఆయన సినిమా అంటే వాణిజ్య ఇంద్రజాలం. ఆయన కథానాయిక ఓ స్వప్న సుందరి. ఆయన సినిమాలోని పాటే సౌందర్య లహరి. తరాలు మారినా దర్శకేంద్రుడి సినిమాకు మాత్రం నిత్య యవ్వనం. పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి'(pelli sandadi movie release date) సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో మరో చిత్రం తెరకెక్కింది. గౌరీ రోణంకు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్ 15) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు రాఘవేంద్రరావు.
"దసరా పండగకు ఇంటిల్లిపాదికీ సందడిని పంచుతుంది. విస్తరాకులో విందు భోజనంలా అన్ని రుచులూ ఉన్న సినిమా ఇది. కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఇంకా థియేటర్లకు రాలేదు. ఈ సినిమా కచ్చితంగా కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత... అదీ అప్పటి 'పెళ్లిసందడి'(pelli sandadi 2021 trailer) హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరో కావడం... ఇదంతా కూడా యాథృచ్ఛికంగానే జరిగింది. నిజానికి మేం మొదట వేరే కథతో వేరే హీరోలతో సినిమా చేయాలనుకున్నాం. నా దగ్గర పదేళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోణంకు పెళ్లి నేపథ్యంలో ఈ కథను మలచడం వల్ల 'పెళ్లిసందడి' తెరపైకొచ్చింది. ఈ కథకు కొత్త హీరో అయితే బాగుంటాడని అనుకుంటున్న సమయంలోనే హృతిక్ రోషన్ లాంటి లుక్స్‌తో రోషన్ కనిపించాడు. వెంటనే శ్రీకాంత్‌కు ఫోన్ చేశా. 'నేనే మీకు చూపిద్దాం అనుకున్నాను, ఇలా తయారయ్యాడు వాడు' అంటూ రోషన్ గురించి చెప్పాడు."
అంతేనా, లేక ఆ పెళ్లి సందడి కథతో ఏమైనా సంబంధం ఉండటం వల్ల రోషన్‌ను ఎంపిక చేసుకున్నారా?
చాలా మంది 'అప్పటి పెళ్లిసందడికి సీక్వెలా?'(pellisandadi sequel) అంటున్నారు. మేం కూడా మొదట 'పెళ్లిసందడి 25' అనే పేరు పెట్టాలనుకున్నాం. కానీ మళ్లీ ఆ కథతో సంబంధం ఉందనుకుంటారని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాం. ఆ కథకీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. పెళ్లి చుట్టూనే సాగే కథ కావడం, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పేరు ఉండాలనే ఆలోచనతోనే 'పెళ్లిసంద...డి' అని పెట్టాం. అప్పటి సినిమాలో ఫైట్లు ఉండవు. ఇందులో ఫైట్లు కూడా ఉంటాయి. అప్పట్లో 'పెళ్లిసందడి' విడుదలైనప్పట్నుంచి తెలుగునాట ఫలానావారి పెళ్లి సందడి అని శుభలేఖల్లోనూ, వాహనాలపైన అచ్చు వేయించడం అలవాటైంది. ఇప్పుడు కూడా అంతే. ఈ సినిమా విడుదలయ్యాక ఇదే తరహాలోనే చివర్లో డి అనే రాసుకుంటారు. అంతగా ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని నమ్మకముంది. వినోదానికి ప్రాధాన్యమున్న కథ కావడం వల్ల దర్శకుడు అనిల్ రావిపూడితోపాటు అప్పటి సినిమా రచయిత సత్యానంద్ కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. పెళ్లిసందడి అనగానే పాటలే గుర్తుకొస్తాయి కాబట్టి ఈ సినిమా విషయంలోనూ సంగీతం పరంగా కీరవాణి(pellisandadi music director) ఛాలెంజ్‌గా తీసుకుని స్వరాలు సమకూర్చారు.
తొలిసారి మీరు కెమెరా ముందుకొచ్చారు. అదెలా జరిగింది?
'ఘర్షణ' సినిమాకే అనుకుంటా.. గౌతమ్ మేనన్, వెంకటేష్ నన్ను నటించమని బలవంతం చేశారు. ఆ తర్వాత 'శతమానం భవతి' సినిమాలో ప్రకాశ్ రాజ్ చేసిన పాత్ర కోసం కూడా మొదట నన్నే సంప్రదించారు. కానీ నేను నటించలేదు. 'శతమానం భవతి' సినిమాలో కొడుకులు నిర్లక్ష్యం చేసే ఓ తండ్రి పాత్ర. నిజ జీవితంలో నాకూ, మా పిల్లలకీ చాలా అనుబంధం ఉంటుంది. అందుకే ఆ పాత్ర చేయలేనని చెప్పా. పైగా సినిమాలో అదొక పెద్ద పాత్ర. తొలిసారే అంత బరువైన పాత్ర చేయడం కష్టం కాబట్టి చేయనని చెప్పా. ఊరెళ్లినప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా మేమే ఓ స్క్రిప్ట్ రాసుకుని మేమే నటిస్తూ సెల్‌ఫోన్లలో షూట్ చేస్తుంటాం. అవి మా పిల్లలకి చూపించినప్పుడు మీరు సినిమాలో కూడా నటించొచ్చు కదా అంటుంటారు. ఇందులో సూత్రధారి తరహా పాత్ర ఒకటి ఉండటం, పక్కన రాజేంద్రప్రసాద్ లాంటి ఓ పెద్ద నటుడు ఉంటాడనే ఆ పాత్రను నేను చేశా. ఈ సినిమా మా తమ్ముడు కృష్ణమోహన్‌రావు సమర్పకులుగా రూపొందడం కూడా మరో ప్రత్యేకత. నేను, మా తమ్ముడు కలిసి ఆర్.కె.ఫిల్మ్స్ పతాకంపై 12 సినిమాలు నిర్మించాం. నా సమర్పణలో 'బాహుబలి' వచ్చింది. అలా మా తమ్ముడి సమర్పణలోనూ ఓ సినిమా రావాలని, తను ఉన్నప్పుడే ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆర్నెళ్ల కిందట తను మాకు దూరమయ్యాడు. తనకు ఈ సినిమాలోని పాటలు చూపించామంతే.
నేటి స్టార్లలో చాలా మందిని కథానాయకులుగా మీరే పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్తతరంతో పనిచేయడం ఎలా ఉంటుంది?