తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రభాస్.. ఒక్క నవ్వుతో బాధలన్నీ పోగొట్టగలడు' - radheshyam release dae

Prabhas Radheshyam movie: ప్రభాస్​, పూజాహెగ్డేను ప్రశంసించారు దర్శకుడు రాధాకృష్ణ. డార్లింగ్​​.. ఒక్క నవ్వుతో బాధలన్నీ పోగొట్టి ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చగలడని చెప్పిన ఆయన.. పూజా అద్భుతమైన నటి అని కితాబిచ్చారు. ఇంకా 'రాధేశ్యామ్'​ చిత్రం గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవేంటో చూద్దాం..

prabhas radheshyam
ప్రభాస్​ రాధేశ్యామ్​

By

Published : Jan 12, 2022, 4:00 PM IST

Prabhas Radheshyam movie: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం 'రాధేశ్యామ్'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినీ ప్రియులు, ప్రభాస్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు రాధాకృష్ణ ట్విటర్‌లో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ విశేషాలివీ..

'రాధేశ్యామ్‌' విషయంలో మీ నమ్మకం ఏంటి?

రాధాకృష్ణ: కథ, ప్రభాస్‌పైనే నమ్మకంగా ఉన్నా.

'రాధేశ్యామ్‌' గురించి ఒక్క మాటలో..

రాధాకృష్ణ:ప్రేమ.

ఇతర ప్రేమ కథలకు, 'రాధేశ్యామ్‌'కు తేడా ఏంటి? మేం కొత్తగా ఏం చూడబోతున్నాం?

రాధాకృష్ణ:నిజమైన ప్రేమ.

ఈ సినిమా తొలికాపీ చూసిన తర్వాత మీకొచ్చిన ప్రశంస?

రాధాకృష్ణ:నేను బాగా తీశానని నన్ను నేనే ప్రశంసించుకున్నా.

ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

రాధాకృష్ణ:ఒక్క నవ్వుతో బాధలన్నీ పోగొట్టి ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చగలడు.

కృష్ణంరాజు గురించి ఒక్క మాటలో?

రాధాకృష్ణ:పరమహంస.

కథానాయిక పూజాహెగ్డే గురించి చెప్పండి..

రాధాకృష్ణ:పూజా అద్భుతమైన నటి. తన బెస్ట్‌ ఇవ్వటంలో ఎప్పుడూ పోటీ పడుతుంటుంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌ లుక్స్‌ ఎలా ఉంటాయి?

రాధాకృష్ణ:మీరు ఇప్పటివరకూ చూసినవాటి కంటే అద్భుతంగా ఉంటాయి.

ఈ సినిమాలో ప్రభాస్‌ డ్యాన్స్‌ ఎలా ఉంటుంది?

రాధాకృష్ణ:ప్రభాస్‌ మీ హృదయాల్లో డ్యాన్స్‌ చేస్తాడు.

మీపై వచ్చే మీమ్స్‌ చూస్తారా? వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది?

రాధాకృష్ణ:సోషల్‌ మీడియాలో వచ్చే మీమ్స్‌ చూస్తుంటా. అవి నా ఒత్తిడిని తగ్గిస్తుంటాయి.

ఇది పాన్‌ ఇండియా చిత్రం కదా. మీరు ఉత్తరాది (హిందీ) వారికి రిప్లై ఇవ్వరు. ఇలానే కానివ్వండి.. (నవ్వుతూ)

రాధాకృష్ణ:ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు బ్రదర్‌. థియేటర్లలో త్వరలోనే కలుద్దాం.

యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మాతలతో మీ అనుబంధం?

రాధాకృష్ణ:తోడబుట్టిన వారికంటే ఎక్కువ.

చిత్రీకరణకు సంబంధించి మీరు మరిచిపోలేని రోజు?

రాధాకృష్ణ:ప్రతిరోజూ.

ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు?

రాధాకృష్ణ:పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత.

మీరు లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా? ఒకవేళ కాకపోతే ఏమైనా సలహాలు ఇవ్వండి.

రాధాకృష్ణ:నేను అన్నీ పాస్‌ అయిపోయా. అదే సమస్య (నవ్వుతూ..)

మీ తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?

రాధాకృష్ణ:అతి త్వరలోనే..

ఇదీ చూడండి:ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details