ముంబయిలోని(puri jagannadh liger) ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు వింత అనుభవం ఎదురైంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న 'లైగర్' చిత్రం కోసం పాటను చిత్రీకరించేందుకు వెళ్తుండగా దారిలో సిగ్నల్ పడింది. పుట్ పాత్ నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ప్రమోద్ అనే తెలుగు కుర్రాడు.. పూరీ(liger movie director) కారును గుర్తుపట్టి పలకరించాడు. సిగ్నల్ సమయంలో కాసేపు ప్రమోద్‌తో మాట్లాడిన పూరీ.. ఆ కుర్రాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో 'లైగర్'(liger movie release date) సినిమా రాబోతుందని సూచించారు. పూరీ మాటలతో ఎంతో మురిసిపోయిన ఆ కుర్రాడు.. కారులో నుంచి వీడియో తీస్తున్న ఛార్మిని తన వీడియో ట్విట్టర్లో పెట్టాల్సిందిగా కోరాడు. ప్రమోద్ కోరిక మేరకు నటి, నిర్మాత ఛార్మి.. ప్రమోద్, పూరీల మధ్య జరిగిన సరదా సంభాషణలను ట్విట్టర్లో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఆశ్చర్యం కలుగుతోంది
యువనటుడు విజయ్ దేవరకొండ(vijaydevarkonda liger movie) మునుపెన్నడూ లేని విధంగా డ్యాన్స్ చేస్తున్నాడని నటి, నిర్మాత ఛార్మి తెలిపింది. విజయ్ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్' చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. "లైగర్ సాంగ్ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. విజయ్ మునుపెన్నడూలేని విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అతని ఎనర్జీని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన పెర్ఫామెన్స్‌ను చూస్తూ ఈ పోస్ట్ పెడుతున్నా. తెరపై తన డ్యాన్స్ అదిరిపోద్ది" అని ఛార్మి పేర్కొంది. సెట్‌లోని ఓ ఫొటోని షేర్ చేసింది.
ఈ చిత్రం మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన అనన్యా పాండే(liger movie heroine) హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
ఇదీ చూడండి: ట్రైలర్స్‌తో హిందీ చిత్రాలు.. 'వరుడుకావలెను' సర్ప్రైజ్