ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రహస్యంగా వివాహం చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన తన మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారని కొందరు రాయగా.. ఫిజియోథెరపిస్ట్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారని మరికొందరు చెప్పారు. ఈ ప్రచారంపై ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం స్పందించారు. 'మీ వద్దే సమాచారం అంతా ఉంది. ప్రభుదేవా వివాహం పట్ల మా కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నాం' అని తేల్చి చెప్పారు.
ప్రభుదేవా రెండో పెళ్లి నిజమే.. సోదరుడు స్పష్టత - prabhudeva latest news
కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా రెండో పెళ్లిపై ఆయన సోదరుడు రాజు సుందరం స్పష్టతనిచ్చారు. వివాహం పట్ల తమ కుటుంబం అంతా సంతోషంగా ఉందని చెప్పారు.
ముంబయిలో నివాసం ఉంటున్న వైద్యురాలు హిమనిని ప్రభుదేవా వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ప్రభుదేవా కాలికి, వెన్నెముకకు తరచూ స్వల్ప గాయాలు అవుతుండేవి. ఆయనకు హిమని చికిత్స అందించేవారట. రెండు నెలలు సహ జీవనంలో ఉన్నట్లు సమాచారం. మేలో చెన్నైలోని ప్రభుదేవా నివాసంలో పెళ్లి జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో శుభకార్యం జరిగినట్లు తెలిసింది. ఈ వార్తల గురించి ప్రశ్నించగా.. రాజు సుందరం స్పష్టత ఇచ్చారు. ప్రభుదేవా 1995లో రామలతను వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు హిమనిని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఇది చదవండి:సెప్టెంబరులోనే ప్రభుదేవా రహస్య వివాహం!