'గీత గోవిందం' సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిన పరశురామ్.. ప్రస్తుతం నాగచైతన్యతో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టు గురించి స్పష్టతనిచ్చాడు ఈ డైరక్టర్.
ప్రసిద్ధ సింహాచలం వరాహనరసింహ స్వామిని.. పరశురామ్ సతీసమేతంగా బుధవారం దర్శించుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో మహేశ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. కథ ఇప్పటికే సిద్ధమైందని అన్నాడు.