బాక్సాఫీస్ దగ్గర ఓ దర్శకుడి సినిమాలు పరాజయమైతే అవకాశాలు తగ్గిపోతుంటాయి. అదే హిట్ కొడితే ఎన్నో అవకాశాలు. కానీ 'గీత గోవిందం' లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరినా, అప్పటి నుంచి మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోతున్నాడు.
'గీత గోవిందం' తర్వాత బన్నీతో సినిమా చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. మహేశ్ బాబుకు రెండు, మూడు కథలు వినిపించినప్పటికీ అవీ కుదరలేదు. ఇటీవలెే అఖిల్, ప్రభాస్లలో ఎవరో ఒకరితో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడని అన్నాడు. ఈ విషయంలోనూ స్పష్టత రాలేదు.