తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విహారయాత్రలో దర్శకుడు రాజమౌళి దంపతులు - latest rajamouli news updates

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి కర్ణాటకలోని బండీపుర్​ జాతీయ ​పార్కును సందర్శించారు. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయన.. అక్కడి ప్రకృతి సౌందర్యాలను తిలకించారు.

Rajamouli
రాజమౌళి

By

Published : Sep 16, 2020, 7:22 PM IST

దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్​ రాజమౌళి బుధవారం కర్ణాటక చామరాజనగర్ జిల్లా బండీపుర్​ జాతీయ​ పార్కును సందర్శించారు.

మంగళవారం భార్యతో కలిసి కనియనపురంలోని సెరాయ్​ రిసార్ట్​లో బస చేశారు రాజమౌళి. బుధవారం ఉదయం హిమావద్ గోపాలస్వామి హిల్స్​ ప్రాంతంలో సఫారీకి వెళ్లారు. అక్కడి ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు.

రాజమౌళితో కలిసి ఫొటో తీసుకున్న అటవీశాఖ అధికారులు
గోపాలస్వామిని దర్శించుకున్న రాజమౌళి దంపతులు

ప్రకృతి సంపదను సంరక్షిస్తున్న అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు రాజమౌళి. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

ప్రకృతి సౌందర్యాలను తిలకిస్తూ...

ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఇందులో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ కథానాయకులు. దాదాపు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details