‘రైస్ బకెట్ ఛాలెంజ్’, ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’.. అంటూ సామాజిక బాధ్యతలపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల ఛాలెంజ్‌లు వచ్చాయి. ఈ జాబితాలోకి 'వన్ బకెట్ ఛాలెంజ్' చేరింది. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న నీటి సమస్యను దృష్టిలో పెట్టుకోని, పరిష్కార మార్గంగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దీనికి శ్రీకారం చుట్టాడు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ ఏం చేయాలి..?
ప్రతిఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా, తమ అవసరాలను కేవలం ఒక బకెట్ నీటితో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్నానం చేయడం దగ్గర నుంచి చేతులు శుభ్రం చేసుకోవడం వరకు అన్ని అవసరాలను ఈ బకెట్ నీళ్లతో పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల నీటిని ఆదా చేస్తూ, అందరికీ నీటి ప్రాముఖ్యతను తెలియజేయవచ్చని నాగ్ అశ్విన్ తెలిపాడు.
రాబోయే ఆదివారం (జులై 21న) అందరూ ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి సామాజిక బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చాడు. మరి ఈ ఛాలెంజ్‌ను ఎంత మంది స్వీకరిస్తారో చూడాలి.
ఇది చదవండి: 'బాటిల్క్యాప్ ఛాలెంజ్' యువరాజ్ స్టైల్లో...