తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ సినిమా తెలుగు 'అసురన్': దర్శకుడు మారుతి - tollywood news

రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన 'పలాస 1978' సినిమాకు సంబంధించిన ఓ కొత్త వీడియోను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు 'అసురన్' ఈ సినిమా: దర్శకుడు మారుతి
దర్శకుడు మారుతి

By

Published : Jan 8, 2020, 5:33 PM IST

Updated : Jan 8, 2020, 6:34 PM IST

'పలాస 1978' కార్యక్రమం

'పలాస 1978' సినిమా... తెలుగులో 'అసురన్' కానుందని దర్శకుడు మారుతి అన్నాడు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో 'పలాస'లో నటించిన పాత్రల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ, మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పలాస 1978 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దర్శకుడు మారుతి

'పలాస 1978'లో రక్షిత్, నక్షత్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తెలుగులో ఓ గొప్ప చిత్రంగా నిలవడం ఖాయమని మారుతి అన్నాడు. జీఏ2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తుండటం వల్ల తమకెంతో మేలు జరుగుతుందని చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ చెప్పాడు.

ఇది చదవండి: వెంకీ 75.. ఇటు త్రివిక్రమ్‌.. అటు 'అసురన్‌'!

Last Updated : Jan 8, 2020, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details