'ఉప్పెన'తో బేబమ్మగా తెలుగువారికి చేరువైన నటి కృతిశెట్టి. తన అందచందాలతో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలు గెలుచుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తుంది. ఇందులో ఆదిపినిశెట్టి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అందుకే ఫైర్..
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కృతిశెట్టిపై లింగుస్వామి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. నాజర్-కృతిశెట్టిలపై ఓ ఎమోషనల్ సీన్ చిత్రీకరించారని.. భావోద్వేగాలను పండించడంలో ఆమె విఫలమయ్యారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంటపాటు ఎన్నో రీటేక్‌లు తీసుకున్నప్పటికీ సీన్ ఓకే కాకపోవడం వల్ల నాజర్ అసహనికి గురయ్యారని.. దాంతో లింగుస్వామి ఆమెను తిట్టారని సమాచారం.