తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూరి, సుకుమార్​ ట్రాక్​లోకి కొరటాల శివ! - producer Director Koratala Siva

దర్శకుడు కొరటాల శివ.. ఓ ప్రొడక్షన్​ హౌస్​ ప్రారంభించబోతున్నట్లు టాక్​. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Director Koratala Siva
కొరటాల శివ

By

Published : Mar 20, 2020, 11:35 AM IST

తెలుగు కథానాయకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారారు. దర్శకులూ ఇదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, సుకుమార్‌.. ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. నూతన నటీనటుల్ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కొరటాల శివ ఈ జాబితాలో చేరనున్నాడని టాక్‌. ఎప్పటి నుంచో అతడికి ఈ ఆలోచన ఉందని, తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సినిమాలు చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' తెరకెక్కిస్తున్నాడు కొరటాల. కరోనా కారణంగా చిత్రీకరణకు కొంత కాలం విరామం ప్రకటించారు.

ఇదీ చూడండి : కాలక్షేపం కోసం కసరత్తులు చేస్తోన్న హీరో

ABOUT THE AUTHOR

...view details