తమిళ నటుడు ధనుష్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జగమే తంత్రం'. వైనాట్ స్టూడియోస్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు కార్తిక్.
"మేం 'జగమే తంత్రం' చిత్రాన్ని ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేయాలని భావించడం లేదు. మళ్లీ ప్రేక్షకులు సినిమా థియేటర్లోకి వస్తారనే నమ్మకం మాకు ఉంది. థియేటర్లు తెరుచుకోగానే మా చిత్రం తెరపైనే విడుదల చేస్తాం. సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. అప్పుడే ప్రేక్షకుడి అనుభూతి అదోలా ఉంటుంది."