తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముచ్చటగా మూడు సీక్వెల్స్​తో గౌతమ్​మేనన్​ - ఏ మాయ చేశావే సీక్వెల్

తాను తెరకెక్కించిన మూడు చిత్రాలకు సీక్వెల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు దర్శకుడు గౌతమ్ మేనన్. వీటిలో ముందుగా 'విన్నైతాండ వరువాయ'కు కొనసాగింపు తీయనున్నట్లు స్పష్టం చేశారు.

ఆ మూడు సినిమాల సీక్వెల్స్​కు కథలు సిద్ధం
శింబు త్రిష

By

Published : May 26, 2020, 3:16 PM IST

తమిళ రొమాంటిక్ హిట్ 'విన్నైతాండ వరువాయ' (ఏ మాయ చేశావే) సినిమాకు సీక్వెల్ సిద్ధమైందని చెప్పారు ప్రముఖ దర్శకుడు గౌతమ్​ మేనన్. దీనితో పాటే తాను తీసిన 'రాఘవన్', 'ఎంతవాడు గానీ' చిత్రాలకు కొనసాగింపు కథలు తయారు చేశానని చెప్పారు. ఇటీవలే జరిగిన ఓ లైవ్​ సెషన్​లో మాట్లాడుతూ ఈ విషయాల్ని స్పష్టం చేశారు.

2010లో 'విన్నైతాండ వరువాయ'లో శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను తెలుగులో నాగచైతన్య, సమంతలతో రీమేక్ చేశారు. ఇలా రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆదరించిందీ చిత్రం. కథానాయకుడు శింబు సరేనన్న వెంటనే ప్రాజెక్టు పట్టాలెక్కిస్తానని చెప్పారు మేనన్​. అయితే ఇందులో హీరోయిన్​గా అనుష్క శెట్టి నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఏ మాయ చేశావే, రాఘవన్, ఎంతవాడుగానీ సినిమాలు

ABOUT THE AUTHOR

...view details