తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీవారి సేవలో బోయపాటి.. 'అఖండ' విడుదలపై క్లారిటీ - Akhanda movie climax shooting

సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ చిత్ర నిర్మాణం ఆఖరి దశలో ఉందని తెలిపారు.

Boyapati, Boyapati Srinu, Akhanda Cinema
బోయపాటి, బోయపాటి శ్రీను, అఖండ సినిమా

By

Published : Jun 30, 2021, 10:48 AM IST

సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. బాలకృష్ణతో తాను చేస్తున్న అఖండ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్.. ఆఖరి దశలో ఉందని చెప్పారు.

"అఖండ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో ఉంది. లొకేషన్ల కోసం వెతుకున్నాం. వర్షాలు లేని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకుంటున్నాం. చిత్తూరు, కడప జిల్లాల్లో చిత్రీకరణకు ప్రయత్నిస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గి.. ప్రజలంతా ఆనందంగా ఉన్నప్పుడే చిత్రాన్ని విడుదల చేస్తాం".

- బోయపాటి శ్రీనివాస్, సినీ దర్శకుడు

మాస్ డైరెక్టర్ బోయపాటి.. బాలయ్య కాంబినేషన్​లో వస్తున్న మూడో చిత్రం 'అఖండ'. దీంతో చిత్రసీమలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్​ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా రామ్‌ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 50 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విటర్ ద్వారా తెలిపింది. "కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ ఆయన అభిమానులతో పాటు సినీ జనాలను ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details