బాలీవుడ్ యువహీరో సుశాంత్ ఆత్మహత్యతో సంబంధమున్న ఆరోపణలతో పలువురు నటీనటుల్ని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఈ క్రమంలో నేడు, బాంద్రా పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. తన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
ఇప్పటికే సుశాంత్ మృతితో సంబంధమున్న 28 మంది వ్యక్తులను ప్రశ్నించి, ఆ సమాచారాన్ని రికార్డు చేశారు బాంద్రా పోలీసులు. ఈ నటుడు ఎందుకు సుసైడ్ చేసుకున్నాడో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.