తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుమకు ధన్యవాదాలు చెప్పిన 'జాతిరత్నాలు' డైరెక్టర్ - మూవీ లేటేస్ట్ న్యూస్

సినిమా విడుదలకు ముందు క్యాష్ షోలో పాల్గొనడం తమకు బాగా గుర్తింపు వచ్చిందని దర్శకుడు అనుదీప్ అన్నారు. 'జాతిరత్నాలు' సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోందని తెలిపారు.

director anudeep said thanks to anchor suma
సుమకు ధన్యవాదాలు చెప్పిన 'జాతిరత్నాలు' డైరెక్టర్

By

Published : Mar 12, 2021, 5:11 PM IST

'జాతిరత్నాలు'తో దర్శకుడిగా నవ్వుల సందడి నెలకొల్పి.. బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ అందుకున్నారు దర్శకుడు అనుదీప్‌. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 'జాతిరత్నాలు' చిత్రానికి 'క్యాష్‌' ప్రోగ్రామ్‌ వల్ల బాగా ప్రమోషన్‌ లభించిందని ఈ డైరెక్టర్ అన్నారు.

'జాతిరత్నాలు' విజయోత్సవంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్‌.. 'థియేటర్లలో 'జాతిరత్నాలు' సినిమా చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మా సినిమా విడుదలను వాయిదా వేశాం. మా సినిమా విడుదలయ్యాక స్పందన ఎలా ఉందో చూద్దామని నగరంలోని కొన్ని థియేటర్లకు వెళ్లాం. ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారు. వాళ్ల ఆనందాన్ని చూస్తే మాకు ముచ్చటగా అనిపించింది. అయితే సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు మేము ఈటీవీలో ప్రసారమయ్యే 'క్యాష్‌'కు వెళ్లాం. సుమగారి వల్ల నాకూ, మా చిత్రానికి విడుదలకు ముందే మంచి గుర్తింపు లభించింది. థ్యాంక్యూ సుమ" అని అనుదీప్‌ వెల్లడించారు.

'జాతిరత్నాలు' సినిమా

అంతేకాకుండా తనకు అన్ని రకాల జానర్లలో సినిమా చేయాలని ఉందని.. ప్రస్తుతం లవ్‌, రొమాంటిక్‌ కథను సిద్ధం చేస్తున్నానని ఆయన అన్నారు.

'జాతిరత్నాలు' సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ‌రియా అబ్దుల్లా కథానాయిక. ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details