- లాక్డౌన్లో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలతో నటుడు సోనూసూద్ 'ఐ యామ్ నో మెస్సీయ' అనే పుస్తకాన్ని రాశారు. 'ఆచార్య' షూటింగ్లో పాల్గొన్న సోనూసూద్.. ఆ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి పుస్తకాన్ని బహుకరిస్తున్న సోనూసూద్
- టాలీవుడ్ యంగ్‌హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'రెడ్'. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆ సినిమా నుంచి 'డించక్ డించక్' అనే మాస్ సాంగ్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది.
- 'జాంబీరెడ్డి' బిగ్ బైట్ (ట్రైలర్)ను విడుదల చేయనున్నట్లు ఆ చిత్రబృందం బుధవారం ప్రకటించింది. అయితే ఆ బిగ్బైట్ను ఓ బిగ్గెస్ట్ స్టార్ రిలీజ్ చేయనున్నారని చిత్రబృందం పేర్కొంది. అయితే ఆ స్టార్ పేరు మాత్రం చెప్పలేదు. 'జాంబీరెడ్డి' ట్రైలర్ రిలీజ్ పోస్టర్
- ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'కంబాలపల్లి కథలు'. స్వప్న సినిమాస్ పతాకంపై అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మించిన ఈ సిరీస్‌లోని తొలి భాగం 'మెయిల్' పేరుతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా 'మెయిల్' ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 2005లో అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతాలకు కంప్యూటర్ పరిచయం అవుతున్న కాలంలో ఏం జరిగిందనే కథాంశంతో 'మెయిల్'ను తీర్చిదిద్దారు. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కంబాలపల్లి కథలు.. ఆహా ఓటీటీలో విడుదలకానున్నాయి.
- మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'దృశ్యం 2'. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'దృశ్యం2' టీజర్ రిలీజ్ పోస్టర్
- ప్రముఖ సంగీత స్వరకర్త దత్తా నాయక్ బయోపిక్ రూపొందించడానికి రంగం సిద్ధమైంది. యూడ్లీ ఫిల్మ్స్ సెల్యూలాయిడ్, సరిగమ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించున్నాయి. ఈ సినిమా కోసం దత్తా నాయక్ కుమారుడు రూప్ నాయక్ చిత్రబృందంతో కలిసి పనిచేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దత్తా నాయక్ బయోపిక్మ్యూజిక్ డైరెక్టర్ దత్తా నాయక్ బయోపిక్
మెగాస్టార్‌కు సోనూ పుస్తకం.. 'డించక్' పాటతో అలరిస్తున్న రామ్ - జాంబీరెడ్డి ట్రైలర్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. హీరో రామ్ నటించిన 'రెడ్' చిత్రంలోని 'డించక్' పాటతో పాటు.. 'జాంబీరెడ్డి', 'కంబాలపల్లి కథలు', 'దృశ్యం2' సినిమా అప్డేట్లను చిత్రబృందాలు పంచుకున్నాయి.
![మెగాస్టార్‌కు సోనూ పుస్తకం.. 'డించక్' పాటతో అలరిస్తున్న రామ్ dinchak song released from red movie.. sonu sood gifts his book to megastar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10062593-thumbnail-3x2-socialwatch-hd.jpg)
మెగాస్టార్‌కు సోనూ పుస్తకం.. 'డించక్' పాటతో అలరిస్తున్న రామ్
ఇదీ చూడండి:నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప
Last Updated : Dec 30, 2020, 8:32 PM IST