తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ అవకాశం మిస్.. ప్రత్యేక గీతంతో హిట్ - వరుణ్​తేజ్​

'గద్దలకొండ గణేష్' సినిమాలో ప్రత్యేక గీతంతో అలరిస్తున్న నటి డింపుల్.. ఈ పాట చేసేందుకు గల కారణాలు చెప్పింది. ఈ ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపింది.

డింపుల్​ హయాతీ

By

Published : Sep 21, 2019, 2:58 PM IST

Updated : Oct 1, 2019, 11:24 AM IST

మెగాహీరో వరుణ్​తేజ్​ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్​'. శుక్రవారం వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్​ టాక్ దక్కించుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో ఓ కథానాయికగా నటించాల్సిన డింపుల్​ హయాతి.. పలు కారణాలతో ప్రత్యేక గీతంలో సందడి చేసింది. ఈ పాటకు ఇంత ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అయితే ఈ సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పింది.

డింపుల్​ హయాతీ

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​, అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. తమిళ సూపర్​హిట్​ 'జిగర్తాండ'కు రీమేక్​ ఈ చిత్రం.

ఇదీ చూడండి: పండక్కి వచ్చేస్తున్న నందమూరి హీరో

Last Updated : Oct 1, 2019, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details