బాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్ 'దిల్వాలే దుల్హానియా లేజాయేంగే'.. ఇటీవలే పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'డీడీఎల్జే'ను ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించారు సినిమా డిస్ట్రిబ్యూటర్లు. గురవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల సంఘం.
" ప్రేక్షకులను డీడీఎల్జే సినిమా ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చినా అందరూ చూస్తూనే ఉన్నారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం మరో సారి విడుదల చేయడం.. మాకు చాలా సంతోషంగా ఉంది. వెండితెరపై ఈ ప్రేమకథను అందరూ మళ్లీ చూసి ఆనందించవచ్చు. విదేశాల్లోని భారతీయుల ద్వారా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది."
-- నెల్సన్ డిసౌజా, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఉపాధ్యక్షుడు