సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా టికెట్ ధరల విషయం వివాదాస్పదమైంది. చిన్న అవగాహన లోపం వల్ల ప్రభుత్వమే ధరలు పెంచిందనుకున్నారని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే టికెట్ రేట్లు పెరిగాయని తెలిపారు. ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు.
'కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ధరల పెంపు'
'మహర్షి' టికెట్ ధరల వివాదంపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే థియేటర్ యాజమానులు రేట్లు పెంచారని చెప్పారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ధరలు పెంచాం: దిల్‌రాజు
"కోర్టు ఉత్తర్వుల ప్రకారమే థియేటర్ యాజమానులు టికెట్ ధరలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు మాత్రమే అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 నుంచి 100, 110 నుంచి 125, మల్టీప్లెక్స్‌లలో 150 నుంచి 200 రూపాయలకు టికెట్ ధరలను పెంచారు." - దిల్‌రాజు, చిత్ర నిర్మాత