తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​-వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్​ అప్పుడే: దిల్​రాజు - దిల్​ రాజ్​ కొత్త సినిమా

vamshi paidipally vijay movie: తమిళ స్టార్​ హీరో విజయ్​తో తాను నిర్మించనున్న సినిమా షూటింగ్​ను మార్చిలో ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు నిర్మాత దిల్​రాజు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు వెల్లడించారు.

vamshi paidipally vijay movie
వంశీ పైడపల్లి

By

Published : Jan 24, 2022, 5:58 PM IST

vamshi paidipally vijay movie: ఓవైపు యువ హీరోలతో యూత్‌ఫుల్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలు.. మరోవైపు స్టార్‌హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఇటీవల సంక్రాంతికి 'రౌడీ బాయ్స్‌'తో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ఇప్పుడు రామ్‌చరణ్, విజయ్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఆ రెండు భారీ చిత్రాలపై తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ రెండు సినిమాల విడుదల తేదీలపై స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ హీరోగా చేయనున్న సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంశీ చెప్పిన కథ విజయ్‌కి బాగా నచ్చిందని ఆయన అన్నారు.

'మా డైరెక్టర్‌ వంశీ.. విజయ్‌ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా నాకు, మా బ్యానర్‌కి, వంశీకి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా విజయ్‌.. కథ విన్న వెంటనే నచ్చిందని చెప్పారు. అంతేకాకుండా సుమారు 20 సంవత్సరాల తర్వాత తాను ఇలాంటి ఒక అద్భుతమైన కథ విన్నట్లు విజయ్‌ మాతో చెప్పారు. ఒక స్టార్‌ హీరో నుంచి అలాంటి కామెంట్‌ రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. సినిమా షూటింగ్‌ మార్చిలో ప్రారంభించాలనుకుంటున్నాం. అదే మాదిరిగా శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమా కూడా షూటింగ్‌ దశలో ఉంది. అది కూడా పవర్‌ఫుల్‌ కథతో సిద్ధమవుతోంది. కరోనా లేకపోతే ఈ ఏడాది దీపావళికి ఒక చిత్రాన్ని, వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాను. పరిస్థితులపై ఆధారపడి దీపావళికి రిలీజ్‌ చేసేలా ఆలోచిస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం తప్పకుండా ఒక చిత్రాన్ని విడుదల చేస్తాం' అని దిల్‌రాజు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details