'పెళ్లి చూపులు' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. అర్జున్ రెడ్డితో వెండితెరపై తనదైన ముద్రవేసిన కథానాయకుడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ నటించనున్న 12వ చిత్రం ఖరారైంది. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ పోస్ట్‌పై విజయ్ స్పందిస్తూ బ్లాక్ బాస్టర్ లోడింగ్ అవుతుందంటూ దిల్‌రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.