కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు.
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి చిత్రానికి దిల్‌రాజు మద్దతు - shravya verma
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న ఓ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.

సినిమా
సినిమాకుదిల్రాజు మద్దతివ్వడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి తమ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న చిత్రానికి ఇంతకంటే మంచి ఆరంభం దక్కదని.. దిల్‌రాజుతో పని చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇవీ చూడండి.. నాగ్ ఫ్రస్ట్రేషన్‌తో రకుల్ నవ్వుల్ నవ్వుల్
Last Updated : Jul 15, 2019, 10:59 PM IST