ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్ వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. 'హుషారు' చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ ప్రాజెక్టు టైటిల్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దిల్ రాజు వారసుడి చిత్ర టైటిల్ అదేనా? - Aashish
తెలుగు చిత్రసీమలో దిల్రాజును లక్కీహ్యాండ్ అంటారు. అలాంటి నిర్మాత చేతుల మీదుగా అతడి సోదరుడి కుమారుడైన ఆశీష్ తెరంగేట్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి 'రౌడీ బాయ్స్' టైటిల్ పరిశీలిస్తున్నారు.
దిల్ రాజు వారసుడి చిత్ర టైటిల్ అదేనా?
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యువతకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నందున.. కథాపరంగా ‘'రౌడీ బాయ్స్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఇదీ చదవండి: మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా?