తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలి' - అనఘ

కార్తికేయ కొత్త సినిమా 'గుణ 369'లోని తొలిపాటను ప్రముఖ నిర్మాత దిల్​రాజు విడుదల చేశారు. ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

''ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలి'

By

Published : Jul 11, 2019, 7:04 PM IST

పాటను విడుదల చేస్తున్న నిర్మాత దిల్​రాజు

'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ నటించిన చిత్రం 'గుణ 369'. ఇందులోని "ఉదయించిన వేకువలోన.. నయనంలో తొలికలవై" అంటూ సాగే గీతాన్ని ప్రముఖ నిర్మాత దిల్​రాజు విడుదల చేశారు. 'ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

"ఇది మంచి మెలోడీ ఫీల్ గుడ్ సాంగ్‌. అంద‌రికీ న‌చ్చుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌ 'గుణ‌', బాల‌కృష్ణ‌ 'ఆదిత్య 369' సినిమాల‌ టైటిల్స్ స‌గం స‌గం క‌లిపి ఈ చిత్రానికి 'గుణ 369' టైటిల్ పెట్టారు. 369 అంటే ఏంటో ట్రైల‌ర్‌ చూడ‌గానే అర్థ‌మైంది. కార్తికేయ‌ తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్ 100'లా ఇదీ పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను"- దిల్​రాజు, ప్రముఖ నిర్మాత

తొలిపాటను విడుదల చేస్తున్న నిర్మాత దిల్​రాజు

"వెండితెరపై ఇలాంటి క‌థ ఇంతకు ముందు రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఇందులో ఉంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాం." -అర్జున్ జంధ్యాల, చిత్ర దర్శకుడు

ఈ సినిమాలో అనఘ హీరోయిన్​గా నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: హ్యాట్రిక్​ కోసం`గుణ 369`గా వస్తున్న కార్తికేయ

ABOUT THE AUTHOR

...view details