తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎఫ్‌ 3' విడుదలపై దిల్​రాజు క్లారిటీ - సంక్రాంతికి ఎఫ్​ 3

వెంకటేశ్​, వరుణ్​ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 2 మంచి విజయం అందుకుంది. త్వరలోనే దీనికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపైన అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత దిల్​రాజు.

దిల్​రాజు
దిల్​రాజు

By

Published : Feb 4, 2020, 6:45 AM IST

Updated : Feb 29, 2020, 2:23 AM IST

'ఎఫ్‌ 2'.. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ కలిసి నవ్వులు పూయించిన చిత్రం. వాళ్లు ఫ్రస్టేషన్‌లో ఉంటూనే ప్రేక్షకులకు ఎంతో ఫన్‌ అందించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు సీక్వెల్‌ తెరకెక్కబోతుంది. 'ఎఫ్‌ 3'గా వచ్చి అంతకుమించి కామెడీ అందించనుంది. అయితే ఈ సీక్వెల్లో ముగ్గురు కథానాయకులు ఉండబోతున్నారనే విషయం తెలిసిందే. వెంకీ, వరుణ్‌లతోపాటు రవితేజ నటిస్తారని ప్రచారం సాగినప్పటికీ స్పష్టత రాలేదు. కానీ, చిత్ర విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన 'జాను' చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశానికి హాజరైన దిల్​రాజు ఈ చిత్రం గురించి మాట్లాడారు. 'ఎఫ్‌ 3' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాను కూడా అనిల్‌ రావిపూడే తెరకెక్కిస్తున్నాడని స్పష్టం చేశాడు. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తామన్నాడు.

ఏది ఏమైనా వరుసగా సంక్రాంతికో సినిమా సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు అనిల్‌. మహేష్‌ బాబుతో తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇవీ చూడండి.. 'సామ్​ మీరెందుకు లావు అవ్వడం లేదు'

Last Updated : Feb 29, 2020, 2:23 AM IST

ABOUT THE AUTHOR

...view details