కార్తికేయ హీరోగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిప్పీ'. ఈ సినిమాలో దిగంగన సూర్యవన్షీ కథానాయిక. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను అకట్టుకుందీ భామ. ఇప్పుడీ ముద్దుగుమ్మ యాక్షన్ నటుడు గోపీచంద్ చిత్రంలో నటించనుందని సమాచారం. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దిగంగన టీవీ జర్నలిస్టుగా కీలక పాత్ర పోషించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
టీవీ జర్నలిస్ట్‌గా 'హిప్పీ' భామ? - గోపీచంద్ సరసన దిగంగన సూర్యవన్షీ
'హిప్పీ' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ దిగంగన సూర్యవన్షీ. తాజాగా యాక్షన్ నటుడు గోపీచంద్ సరసన ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.
టీవీ జర్నలిస్ట్‌గా 'హిప్పీ' భామ?
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. గోపీచంద్ ఇందులో హాకీ కోచ్‌గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో కనిపించనుంది.
అయితే ఈ సినిమలో దిగంగన తన పాత్రకు న్యాయం చేయగలదని దర్శకుడు గట్టిగా నమ్ముతున్నాడట. ఇప్పటికే ఆమె నటన నచ్చి.. చిత్ర బృందం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దిగంగన తమిళంలోనూ 'ధనుష్ రాశి నేయర్‌గలే' చిత్రంలో నటించింది.
ఇవీ చూడండి.. 'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు