తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టైటానిక్ మరోసారి మునిగిపోయింది...! - జేమ్స్ కామెరున్

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. 'అవెంజర్స్ ఎండ్​గేమ్​'పై వినూత్నంగా ట్వీట్ చేశాడు. సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోందని పేర్కొన్నాడు.

టైటానిక్ మరోసారి మునిగిపోయింది

By

Published : May 9, 2019, 4:22 PM IST

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతగా ప్రదర్శితమవుతున్న హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్:ఎండ్​గేమ్'. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ విషయంపై ట్విట్టర్‌లో వినూత్నంగా స్పందించాడు 'అవతార్' దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. టైటానిక్ చిత్రంలో మంచుకొండ ఓడను ముంచేస్తే, వసూళ్లలో అవెంజర్స్‌.. టైటానిక్‌ని ముంచినట్టు ఉన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు.

'నిజ‌మైన టైటానిక్‌ని ఓ ఐస్‌బ‌ర్గ్ ముంచేస్తే, నా టైటానిక్‌ని మీ అవెంజ‌ర్స్ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన విజ‌యానికి సెల్యూట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ బతికుండటం కాదు చాలా గొప్పగా ఉందని మీరు నిరూపించారు' - ట్విట్టర్​లో జేమ్స్ కామెరూన్

2009లో వచ్చిన అవతార్ సీక్వెల్స్ తెరకెక్కించే పనిలో ఉన్నాడీ దర్శకుడు. 2,3,4,5 భాగాల్ని తీస్తున్నాడు. డిసెంబర్17, 2021న 'అవతార్-2' విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details