ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట.
ప్రస్తుతం కరోనా వల్ల ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్ పునఃప్రారంభమవ్వగానే నెల రోజుల్లో పూర్తైపోయి.. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రెండో భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభిస్తారు.