బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ప్రధానపాత్రల్లో తమిళ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'ను హిందీలో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి ఆమిర్ తప్పుకున్నారని సమాచారం. కథలో ఏకాభిప్రాయం కుదరకే ఆమిర్ తప్పుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతితో తలెత్తిన విభేదాలే అందుకు కారణమని తెలుస్తోంది.
ఆమిర్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్ధా'లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడినట్లు సమాచారం. ఈ కారణంగానే తమిళంలో సేతుపతి పోషించిన 'వేద' పాత్రను చేయడానికి విముఖత వ్యక్తం చేశారట ఆమిర్.