స్టార్ హీరో ప్రభాస్‌కు(prabhas latest news) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ ఫ్యాన్.. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా గుండు చేయించుకున్నాడు. అతడి అభిమానాన్ని చూసి డార్లింగ్ ఆశ్చర్యపోయారు(prabhas updates). తనతో సరదాగా కాసేపు ముచ్చటించారు.
అనంతరం తన వీరాభిమానికి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటికి విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. అయితే ప్రభాస్.. తన అభిమానులకు బహుమతులు ఇవ్వడం ఇదేం కొత్తేమి కాదు. గతంలోనూ పలువురికి గిఫ్ట్‌లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.