తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బర్త్​డే గిఫ్ట్​గా భార్యకు పేపర్​వెయిట్​ ఇచ్చిన అక్షయ్​ - భార్యకు అక్షయ్​ బహుమతి

బాలీవుడ్​ స్టార్ హీరో​ అక్షయ్​కుమార్​ తన సతీమణి ట్వింకిల్​ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పేపర్​ వెయిట్​ను బహుమతిగా ఇచ్చారు. అలా ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా?

akshay
అక్షయ్​

By

Published : Jul 8, 2020, 10:03 PM IST

స్టార్​ కపుల్స్​ తమ భాగస్వామి పుట్టినరోజు వేడుకలకు విలువైన వాటిని కానుకగా ఇస్తుంటారు. కానీ బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్ మాత్రం తన భార్య ట్వింకిల్ ఖన్నాతో డేటింగ్​లో ఉన్న సందర్భంలో ఆమె తొలి పుట్టినరోజుకు​ పేపర్​ వెయిట్​ను బహుమతిగా ఇచ్చారు. తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​తో ఇంటర్వ్యూలో అక్షయ్​-ట్వింకిల్​ ఈ విషయాన్ని తెలిపారు.

ట్వింకిల్​ ఖన్నా చేతి వేలికి ఉన్న డైమండ్​ రింగ్​ కథ వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కరణ్..​ ట్వింకిల్​ను అడిగారు. దీంతో ఆమె ఈ పేపర్​వెయిట్​ ఫ్లాష్​బ్యాక్​ను తెలిపింది.

"మేము డేటింగ్​లో​ ఉన్న సందర్భంలో నా తొలి పుట్టినరోజుకు అక్షయ్​ పేపర్​ వెయిట్​ను బహుమతిగా ఇచ్చాడు. అతను దాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. కానీ అది నాకెంతో నచ్చింది. అదే సమయంలో ఏదో ఒక రోజు నాకు డైమండ్​ రింగ్​ బహుమతిగా ఇవ్వాలని అడిగా. దీంతో నాకు ఈ వజ్ర ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు."

-ట్వింకిల్​ ఖన్నా, అక్షయ్​ కుమార్​ భార్య.

ట్వింకిల్​ ఖన్నా పుట్టినరోజును తాను అప్పుడు మర్చిపోయినట్లు తెలిపారు అక్షయ్​. అనంతరం గుర్తుకువచ్చేసరికి బయటికి వెళ్లి బహుమతి కొనేంత సమయంలేక ఇంట్లోనే ఉన్న పేపర్​ వెయిట్​ను కానుకగా ఇచ్చినట్లు చెప్పారు.

​ ఇది చూడండి : 'సుశాంత్​ మృతిపై బాలీవుడ్​ సమాధానం చెప్పాలి!'

ABOUT THE AUTHOR

...view details