తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీదేవి ఆఫర్​ను తిరస్కరించిన ఆమిర్​! - ఆమిర్​ ఖాన్​ శ్రీదేవి సినిమాలు

ఎందరో స్టార్​ హీరోయిన్​లతో కలిసి నటించిన బాలీవుడ్​ స్టార్​ నటుడు ఆమిర్​ ఖాన్​.. అలనాటి అందాల తార శ్రీదేవితో కలిసి నటించడానికి అప్పట్లో తిరస్కరించారట. ఎందుకంటే?

sridevi
శ్రీదేవి

By

Published : Aug 16, 2021, 5:32 PM IST

అలనాటి తార శ్రీదేవి.. టాలీవుడ్​ నుంచి బాలీవుడ్​ వరకు దాదాపు అందరు స్టార్​ హీరోలతో కలిసి నటించారు. ఈ సుందరితో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అయితే ఈమెతో నటించడానికి మిస్టర్​ పర్​ఫెక్ట్​ ఆమిర్​ ఖాన్​ మాత్రం తిరస్కరించారట.

శ్రీదేవి

ఎందుకంటే?

ఆమిర్​ఖాన్​ తన తొలి సినిమా 'కయామత్​ సే కయామత్​ తక్'తోనే స్టార్​ హీరో అయిపోయారు. దీంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే అప్పటికే స్టార్​ హీరోయిన్​గా ఉన్న శ్రీదేవితో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇద్దరికీ ఫొటోషూట్​ కూడా చేశారు. అయితే టీనేజ్​ కుర్రాడిలా ఉన్న తన పక్కన శ్రీదేవి పెద్ద వయస్కురాలిగా కనిపిస్తుందని ఆమిర్​ ఆ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించారట.

త్వరలోనే ఆమిర్​.. 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కరీనా కపూర్​ హీరోయిన్​. నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్​ సినిమా 'ఫారెస్ట్​ గంప్'​కు రీమేక్​గా ఇది తెరకెక్కుతోంది.

ఇదీ చూడండి: AAMIR KHAN DIVORCE: 'మేం సంతోషంగానే ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details