Rashmika and Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్ లవ్లీ పెయిర్‌గా యువ హృదయాలు గెలుచుకున్నారు నటి రష్మిక, నటుడు విజయ్ దేవరకొండ. 'గీత గోవిందం'లో రష్మిక- విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం.. ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. విజయ్‌తో ప్రేమలో ఉండటం వల్లే ఆమె రక్షిత్‌తో బ్రేకప్ చెప్పారని పలువురు అనుకున్నారు కూడా. అలాంటిదేమీ లేదని రష్మిక- విజయ్ ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ ఇటీవలే వీళ్ల మధ్య ఉన్న రిలేషన్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల దేవరకొండ సోదరులు గోవాకు వెళ్లారు. న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా పలు ఫొటోలు షేర్ చేశారు. అదే సమయంలో రష్మిక సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'హ్యాపీ న్యూ ఇయర్ మై లవ్స్' అని హార్ట్ ఎమోజీతో ఓ ఫొటో షేర్ చేశారు. రష్మిక షేర్ చేసిన పిక్‌లో ఉన్న లొకేషన్.. ఆనంద్ షేర్ చేసిన ఫొటోలోనిది ఒకటే కావడం వల్ల అందరూ విజయ్- రష్మిక డేటింగ్‌లో ఉన్నారంటూ మాట్లాడుకుంటున్నారు.