యువహీరో రానా, హీరోయిన్ త్రిషా మధ్య దశాబ్ద కాలంగా ప్రేమ ఉందనే ప్రచారం జరుగుతూనే ఉంది. అలా ఈ బంధం కాస్త బహిరంగ రహస్యంగానే మారింది. అయితే ఇటీవలే 'కాఫీ విత్ కరణ్' టాక్ షోకు హాజరైన రానా.. త్రిషతో ఉన్న రిలేషన్ గురించి నోరు విప్పాడు.
"నేను, త్రిషా గత పదేళ్ల నుంచి మంచి స్నేహితులుగా ఉన్నాం. మేమిద్దరం డేటింగ్కూ వెళ్లాం. కానీ ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. నా జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగలేదు"