ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల హవా నడుస్తోంది. పలువురు హీరోలు వరుసగా రీమేక్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వాటిలో మలయాళ సూపర్‌హిట్ 'లూసిఫర్' ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఇందులో నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
చిరు 'లూసిఫర్'లో మార్పులు చేస్తున్నారా? - చిరంజీవి న్యూస్
చిరు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమాలో పలుమార్పులు చేయనున్నారని సమాచారం. మాతృక కథకు మరిన్ని హంగులు జోడించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
మాతృకలో మోహన్‌లాల్ పోషించిన స్టీఫెన్ పాత్ర, సినిమా చివరి వరకూ గంభీరంగా ఉంటుంది. కానీ, తెలుగులోకి వచ్చే సరికి కేవలం మాతృక కథలోని ఆత్మను మాత్రం తీసుకుని చిరు అభిమానులు కోరుకున్న మాస్ అంశాలన్నీ జోడించారట. హీరోయిన్ కూడా ఉంటుందని టాక్.
చిరంజీవి సినిమా అంటే అదిరే స్టెప్‌లు ఉండాల్సిందే. మలయాళంలో అసలు వాటి జోలికే పోలేదు.(ఐటమ్ సాంగ్ తప్ప) కానీ, తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్టు పాటలు ఉంటాయని టాక్. 'లూసిఫర్'ను మించి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ సినిమాకు ప్లస్ అవుతాయా? లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.